వీధికుక్కలకు ప్రత్యేక ఆశ్రమం.. 24 గంటలపాటు వైద్య సౌకర్యం.. మ్యూజిక్ థెరపీ కూడా..
Dog Ashram : వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సద్భావన వృద్ధాశ్రమం నిర్వాహకులు. గాయపడిన వాటితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కుక్కలకు కూడా వారు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలతో చికిత్స చేస్తున్నారు. కుక్కల కోసం 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందుబాటులో ఉంచారు.
Dog Shelter Home : జునాగఢ్, అమ్రేలి, గొండాల్‌తో పాటు రాజ్‌కోట్ చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల నుంచి కుక్కలను స్థానికులు తీసుకువస్తున్నట్లు శునకాల ఆశ్రమ నిర్వాహకుడు ఖుషీ పటేల్ తెలిపారు. రెండు నెలల క్రితమే ఇక్కడ 50 కుక్కలతో డాగ్ షెల్టర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 135 కుక్కలు ఉన్నాయని చెప్పారు. అందులో అనారోగ్యంతో ఉన్న కుక్కలు కొన్ని, ప్రమాదం కారణంగా కాళ్లు విరిగిన శునకాలు మరికొన్ని ఉన్నట్లు తెలిపారు. కుక్కలను రోజంతా సంతోషంగా ఉంచడానికి మ్యూజిక్ థెరపీ వంటి వివిధ ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు.