రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఎగిరిపడ్డ పాదచారుడు
Shimla car accident: హిమాచల్‌ప్రదేశ్ శిమ్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంజౌలీలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. బాధితుడికి తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. కారు యజమానికి, బాధితుడికి మధ్య రాజీ కుదిరిందని వివరించారు. కాగా, అక్కడే ఉన్న ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST