కూల్ డ్రింక్ పోస్తేనే సైలెంట్.. 'లాక్డౌన్' మేక స్టైలే వేరు గురూ!
సాధారణంగా వేసవి కాలంలో ఏ జీవైనా ఎండలను తట్టుకోవడానికి నీటిని తాగుతుంది. కానీ ఓ మేక మాత్రం రోజూ కూల్ డ్రింక్నే తాగుతోంది. బిహార్ భాగల్పురల్ని లాక్డౌన్ అనే మేక రోజూ కూల్ డ్రింక్ తాగుతోంది. ఒకవేళ ఆ రోజూ కూల్ డ్రింగ్ లేకపోతే.. ఇంట్లో మాములు రచ్చ చేయదు ఈ మేక. దీని కథ ఏంటో తెలుసుకుందాం పదండి..
ఇదీ కథ
తాతర్పుర్కు చెందిన షాహిద్ బక్రీద్ కోసం ఓ మేకను మూడేళ్లుగా పెంచుతున్నాడు. దీనికి లాక్డౌన్ అని పేరు పెట్టుకున్నాడు. దీనిని పెంచడానికి రోజుకు సుమారు రూ.100 ఖర్చుపెడుతున్నాడు. ప్రస్తుతం 80 కేజీలు ఉన్న మేక.. సుమారు రూ.లక్ష పలుకుతోందని చెప్పాడు. కానీ ఈ మేకను తాను అమ్మబోనని.. తన ఇంట్లోనే వధిస్తానని తెలిపాడు. "తొతాపురి జాతికి చెందిన ఈ మేక 2020 కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న సమయంలో పుట్టింది. అందుకే దానికి లాక్డౌన్ అని పేరు పెట్టాను. మార్కెట్లో సుమారు లక్ష రూపాయల ధర పలుకుతోంది. కానీ నేను దీనిని అమ్మను. ఇంట్లోనే వధిస్తాను." అని షాహిద్ తెలిపాడు.