తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్లాస్టిక్ బకెట్లు, సైకిల్ టైర్లతో బుల్లి 'విమానం'.. 8 గంటల్లోనే తయారీ.. - కేరళ ఇడుక్కి న్యూస్

By

Published : Sep 27, 2022, 3:33 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

కేరళ ఇడుక్కికి చెందిన ప్రిన్స్ భువనచంద్రన్ 8 గంటల్లోనే విమాన ప్రతిరూపాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ఇనుము, ప్లాస్టిక్​ బకెట్లు​, మెటల్ షీట్​లతో ఫ్లైట్​ నమూనాను రూపొందించాడు. ఈ ఫ్లైట్​ 12 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంది. సైకిల్, బైక్ టైర్లను ఉపయోగించి విమానానికి అమర్చాడు. దీన్ని ఓ పాఠశాల కోసం తయారు చేశాడు భువనచంద్రన్. స్కూల్ పార్కింగ్ ప్రదేశంలో పెట్టేందుకు నెడుంకందం పాఠశాల అధికారులు తనను కోరడం వల్ల ఈ విమానాన్ని తయారు చేసినట్లు చెప్పాడు ప్రిన్స్. ఇంతకుముందు కూడా రకరకాల భారీ యంత్రాల ప్రతిరూపాలు తయారు చేశానని చెబుతున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details