తెలంగాణ

telangana

fake bomb

ETV Bharat / videos

Person threatened Bank with fake bomb : డబ్బు కోసం బ్యాంక్‌లో‌ బాంబు బెదిరింపు.. అసలు విషయం తెలిసి అంతా షాక్​.!

By

Published : May 19, 2023, 8:50 PM IST

Person threatened Bank with fake bomb in hyderabad : నాణానికి రెండు పార్శ్వాలు ఎలా ఉంటాయో.. నేటికాలంలో పెరిగిన సాంకేతికత ఉపయోగంతో పాటు.. అదే స్థాయిలో దుర్వినియోగానికి పాల్పడుతోంది. సాధారణంగా యూట్యూబ్​ను వినోదం కోసం చూస్తుంటాం. కొందరు అర్థిక స్తోమత లేని విద్యార్థులు.. యూట్యూబ్​లో ఎడ్యుటెక్ వీడియోలను చూసి ఉద్యోగాలు పొందిన సందర్భాలున్నాయి. కానీ ఇతడు మాత్రం ఈజీ మనీ కోసం యూట్యూబ్​లో ​బాంబు తయారీ వీడియో చూసి.. బ్యాంక్​లో డబ్బు ఇవ్వాలంటూ హల్​చల్​ చేశాడు. 

ఈ ఘటన జీడిమెట్ల పోలీస్​స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ఆదర్శ్​ బ్యాంకులో చోటు చేసుకుంది. తన శరీరానికి బాంబు లాంటి సర్క్యూట్​ బోర్డు పరికరం అమర్చుకుని.. బ్యాంక్​లో డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేకపోతే బాంబ్ పేల్చి.. బ్యాంక్​ని నేలమట్టం చేస్తానని హల్​చల్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించచగా అసలు విషయం బయటపడింది. బాంబులాంటి పరికరాలు ఏవి లేవని తేల్చిన పోలీసులు.. ఈజీ మనీ కోసం యూట్యూబ్​లో చూసి చెరుకు గడలకు రెడ్ టేపు చుట్టుకుని ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని శివాజీ(32)గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details