100 Kg Silver Ganesh Idol : గణేశ్ ఉత్సవాల స్పెషల్.. క్వింటాల్ వెండితో గణపతి విగ్రహం.. ధరెంతో తెలుసా? - మహారాష్ట్ర వెండి వినాయకుడు
Published : Sep 21, 2023, 4:56 PM IST
100 Kg Silver Ganesh Idol :వినాయక చవితి కోసం మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లాలో వంద కిలోల వెండి గణేశుడి ప్రతిమను తయారు చేశారు. ప్రత్యేక ఆర్డర్ మేరకు జిల్లాలోని ఖామ్గావ్కు చెందిన విశ్వకర్మ సిల్వర్ హౌజ్.. ఈ విగ్రహాన్ని రూపొందించింది. జాల్నా జిల్లాలోని అనోఖా గణేశ్ మండల్ నుంచి ఈ ఆర్డర్ వచ్చినట్లు సిల్వర్ హౌజ్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల కోసం దీన్ని ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఐదు నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఐదుగురు స్థానిక కళాకారులు ఈ విగ్రహ తయారీలో భాగమయ్యారు. ఐదున్నర అడుగుల ఎత్తుతో ఉన్న వంద కేజీల ఈ వెండి విగ్రహం తయారీకి రూ.90 లక్షలు ఖర్చయినట్లు విశ్వకర్మ సిల్వర్ హౌజ్ యజమాని రాహుల్ జాంగిడ్ తెలిపారు. సిల్వర్ విగ్రహాన్ని సెప్టెంబర్ 18నే గణేశ్ మండల్ నిర్వాహకులకు అందజేసినట్లు స్పష్టం చేశారు.
రూ.360 కోట్ల బీమా..
ఇదిలా ఉంటే.. ముంబయిలోని ప్రఖ్యాత జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటుచేసిన మహాగణపతి మండపానికి రూ.360.40 కోట్లకు బీమా చేయించారు. మండపంలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని 66.5 కేజీల బంగారం, 295 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. ఆ గణేశుడి ప్రత్యేకతల గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.