తుపాను ధాటికి టెక్సాస్ అతలాకుతలం - టెక్సాస్
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో తుపాను ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. హూస్టన్ నగర సమీపంలోని ప్రాంతాల్లో 10 అంగుళాల మేర వరద నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలకు బ్రోజోస్ నది 47 అడుగల మేర ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. నది పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండకూడదని అధికారులు సూచించారు. తాజాగా మరోమారు తుపాను హెచ్చరికలు చేసింది జాతీయ వాతావరణ సేవల విభాగం. భారీ వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది.