నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు
ఆస్ట్రియాలోని హొలాబ్రున్ నగరంలో ఏటా నిర్వహించే సంప్రదాయ 'క్రాంపస్ రన్' ఈసారీ అట్టహాసంగా సాగింది. ఇందులో ఆస్ట్రియా నలుమూలల నుంచి 19 బృందాలు పాల్గొన్నాయి. దెయ్యాల వేషధారణలతో ఆకట్టుకున్నారు కళాకారులు. వారిని చూసేందుకు దేశవిదేశాల నుంచి వందల మంది వీక్షకులు నగరానికి చేరుకున్నారు. భయంకర ఆకారాలతో హాలీవుడ్ చిత్రాలను మించిన దృశ్యాలు కనిపించాయి.