తెలంగాణ

telangana

ETV Bharat / videos

2020 చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంలోకి...

By

Published : Dec 29, 2020, 5:21 PM IST

న్యూయార్క్​లోని టైమ్స్​ స్క్వేర్​ లో 14వ 'గుడ్​ రిడెన్స్​ డే' కార్యక్రమం సందడిగా సాగింది. కరోనా దృష్ట్యా ఈసారి కార్యక్రమాన్ని వర్చువల్​గా నిర్వహించారు. 2020 సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఇక్కడే వదిలేసి ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలని తమ లిస్ట్​లో పొందుపరిచారు. మరికొంతమంది బ్యాడ్ ఎనర్జీ, ఫేక్​ ఫ్రెండ్స్​ తదితర అంశాలన నుంచి విముక్తి కావాలని తమ లిస్ట్​ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాలివుడ్ నటుడు జొనాతన్ బెన్నెట్ సైతం పాల్గొని 'గుడ్ బై టూ జూమ్​ మీటింగ్స్​' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. .

ABOUT THE AUTHOR

...view details