విభిన్న దుస్తుల్లో పెళ్లి కూతుళ్లలా....!
వియత్నాంకు చెందిన డిజైనర్ ఫ్యోంగ్ అద్భుతమైన సంప్రదాయ దుస్తులను తయారుచేసింది. వాటిని ధరించి మోడళ్లు అచ్చమైన పెళ్లి కూతుళ్లలా తళుక్కుమన్నారు. సాధారణంగా క్రైస్తవ సంప్రదాయంలో జరిగే పెళ్లిలో యువతులు తెల్లటి దుస్తులనే ధరిస్తుంటారు. కానీ వినూత్నంగా నలుపు, ఎరుపు రంగుల్లో వస్త్రాలను ఆకర్షణీయంగా రూపొందించింది డిజైనర్ ఫ్యోంగ్.