పారిస్‌లో వయ్యారి భామల ర్యాంప్ నడకలు... - పారిస్
ఫ్యాషన్ షోలకు చిహ్నంగా మారింది ఫ్రాన్స్ రాజధాని పారిస్. బుధవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లో వివిధ వస్త్రాలంకరణలతో మోడల్స్ ఆకట్టుకున్నారు. ర్యాంప్‌పై నడిచి తమ అందాలను ప్రదర్శించారు. 'ఫర్'తో తయారు చేసిన దుస్తులు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రదర్శనల్లో ఉపయోగించిన దుస్తులను ప్రముఖ డిజైనర్లు విక్టర్, రాల్ఫ్, జీన్ పాల్ గాల్టియర్ రూపొందించారు.