తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రాణాలు దక్కాయంటే ఆశ్చర్యమే..! - truck accident

By

Published : Nov 19, 2019, 8:39 AM IST

అమెరికాలోని ఇల్లినాయిస్​ రాష్ట్రంలో జరిగిన ఓ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఆశ్చర్యరీతిలో ప్రాణాలు దక్కించుకున్నారు. దక్షిణ ఇల్లినాయిస్​లోని రహదారి వెంట పాడయిన తమ కారు టైరు స్థానంలో మరొకటి అమరుస్తున్నారు ఇద్దరు పురుషులు, ఓ మహిళ. అదుపు తప్పిన ఓ ట్రక్కు వారివైపు దూసుకు రాసాగింది. అదే సమయంలో ట్రక్కు తమ వైపుగానే దూసుకొస్తుందని అంచనా వేసిన ఆ ముగ్గురు కారును విడిచి పెట్టి పరుగు అందుకున్నారు. అయితే తప్పించుకోవడంలో వెనకబడిన మహిళకు సహచరులు చేయూత అందించారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఆగి ఉన్న వాహనంలోని డాష్ కెమెరా ఈ ప్రమాదాన్ని చిత్రీకరించింది. వేగాన్ని నియంత్రించలేకపోయిన ట్రక్కు డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details