Woman Cuts down Tree in Mahabubabad : చెట్టులెక్కగలనూ ఓ నరహరి.. కొమ్మలు కొట్టివేయగలను - Woman Cuts down Tree in Mahabubabad
Woman Cuts down Tree in Mahabubabad for power supply : వీధుల్లో ఉన్న చెట్లు పెరిగి విద్యుత్ తీగలకు తగలటం, వాటిని విద్యుత్‌శాఖ సిబ్బంది తొలగించటం సహజం. కానీ ఓ గ్రామంలో ఈ పనిలో విద్యుత్ సిబ్బంది అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక లాభం లేదని భావించిన ఓ మహిళ తానే స్వయంగా రంగంలోకి దిగింది.
విద్యుత్‌శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ తీగలకు చెట్టు కొమ్మలు తగులుతుంటే సాధారణంగా విద్యుత్ శాఖ సిబ్బందిని వాటిని తొలగించి సరఫరాకు ఆటంకం లేకుండా చూస్తారు. కానీ మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామంలో మాత్రం వీధిలో ఓ వేపచెట్టు విద్యుత్తు లైన్లకు అడ్డు తగులుతోంది. దీనివల్ల ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని భావించిన సిబ్బంది ఆ చెట్టును తొలగించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసి నాలుగు రోజులవుతున్నా సిబ్బంది చెట్లు నరికే పని పూర్తి చేయలేదు. దీంతో విసిగిపోయిన ఓ స్థానిక మహిళ.. తానే రంగంలోకి దిగింది. స్వయంగా తానే మొదట చెట్టు కొమ్మలు నరికింది.. అనంతరం మొత్తం చెట్టునే నరికేసింది. ఆ వీధికి విద్యుత్ సరఫరాను తాము నిలిపివేయలేదని చెప్పారు. ఆ మహిళకు చెట్టు నరకమని కూడా తాము చెప్పలేదని అన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వారు తెలిపారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వెల్లడించారు.