Sircilla Temple Reconstruction Inauguration By KTR : తిరుపతి తరహాలో సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం
Reconstruction of Sri Venkateshwara Temple in Sircilla District : రాష్ట్రంలో పలుచోట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణంతో పాటు..... పునర్నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా రూ.2.63 కోట్లు వెచ్చించి సిరిసిల్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునర్నిర్మాణాన శంకుస్థాపన కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాగశాల, కళ్యాణ మండపం, రామానుజ కూటమి, మీటింగ్ హాల్‌తో పాటు పరిపాలన భవనం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టనున్నారు.
సిరిసిల్లలో అందరికి ప్రీతిపాత్రమైన ఆలయ గర్భగుడితో పాటు మరిన్ని నిర్మించి అందంగా తీర్చిదిద్దుదాం. అక్కడ గర్భగుడి ఎలా ఉందో అదే తరహాలో ఇక్కడ కూడా అలానే నిర్మిద్దాం అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ యాగాలు, ఆలయ నిర్మాణాలు చేపట్టారని మనందరికీ తెలుసు, తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ పేరు ఎలా చరిత్రలో నిలిచిపోయిందో.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ పేరును ప్రజలు ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటారని వై.వి.సుబ్బారెడ్డి సలహా ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. టీటీడీ గొప్పగా తీర్చిదిద్దెందుకు వై.వి.సుబ్బారెడ్డి సహకరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.