రహదారిపై మంచు కొండలు.. ప్రయాణికుల ఇక్కట్లు
హిమాచల్ ప్రదేశ్లో సోమవారం నుంచి మంచు భారీగా కురిసింది. తాజాగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం వల్ల మెల్లమెల్లగా హిమం కరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ 5 రహదారిపై వరుసగా మూడు మంచు చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా పర్యటకులు చిక్కుకున్నారు. రహదారిపై ముందుకు దూసుకొస్తున్న మంచు కొండను.. అక్కడే ఉన్న కొంతమంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.