గంగా నదిలో అమాంతంగా కూలిపోయిన నీళ్ల ట్యాంకు
ఉత్తరప్రదేశ్లో గంగా ప్రవాహం ధాటికి ఓ నీళ్ల ట్యాంకు అమాంతం కుప్పకూలిపోయింది. బలియా జిల్లా బైరియా తాలుకాలోని కేహార్పుర్ గ్రామంలో.. నది కరకట్టకు ఆనుకుని ఉన్న నీళ్ల ట్యాంకు గంగా ఉద్ధృత ప్రవాహంతో నదిలో పడిపోయింది. గ్రామంలోని ప్రాథమిక విద్యాలయ శిథిల భవనం కూడా నది జలాల్లో కలిసిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. గ్రామంలోని రెండు నిర్మాణాలు.. నదిలో భూస్థాపితం కావడం పట్ల ఊరిలోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Sep 30, 2019, 4:35 PM IST