ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కి ఒక్క నిమిషం ముందు వీడియో - helicopter crash bipin rawat
Coonoor army helicopter crash video: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన హెలికాప్టర్ ప్రమాదం తాలూకు దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. మరొక్క 5 కిలోమీటర్ల దూరంలో గమ్యం అనగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. సూలూర్ నుంచి బయల్దేరే ముందు ఆ మార్గంలో తక్కువ ఎత్తులో మబ్బులు ఉంటాయని, గాలిలో తేమ ఎక్కువగా, కొద్దిపాటి వర్షం ఉంటుందని వాతావరణ సూచనలో తెలిపారు. కానీ, ప్రమాద సమయానికి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలు ఉంటుందని, ఆ ప్రాంతంలోని నంజప్పన్ చతిరం లోయ మొత్తం దట్టమైన పొగమంచు అలముకుందని స్థానికులు చెబుతున్నారు. 2 మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించని పరిస్థితి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ-17వి5 హెలికాప్టర్.. పొగమంచు లేకపోతే రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్‌లో దిగేది. అంతలోనే ఇలా అయిపోయింది.
Last Updated : Dec 9, 2021, 10:06 AM IST