'మన శరీరం కొవ్వులను నిలవ చేసుకుని, శక్తి అవసరమైనప్పుడల్లా వాటిని కరిగిస్తుంది. కరిగిన కొవ్వులు శక్తిగానూ, చెమటలాంటి శరీర వ్యర్థాల రూపంలోనూ వెలువడతాయి.' అని ఇప్పటివరకూ ఎంతోమంది చెప్పగా విన్నాం. అందులో పూర్తి నిజం లేదంటే నమ్ముతారా..? కష్టమే కానీ నమ్మితీరాలి. ఎందుకంటే చెబుతున్నది అంతర్జాతీయ డాక్టర్లు మరి..!
ఇదీ అసలు సంగతి...!
శరీరంలోని కొవ్వులు 84% శాతం మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌ల రూపంలో బయటికి వెళతాయి. మిగతా 1.6% మాత్రమే చెమట, యూరిన్ మొదలైన వ్యర్థాల రూపంలో విడుదలౌతాయి. అంటే ఉదాహరణకి మనం 10కేజీల బరువు తగ్గితే అందులో 8.4కేజీల కొవ్వులు మనం వదిలే శ్వాసలోని కార్బన్ డై ఆక్సైడ్‌గాను, 1.6కేజీల కొవ్వులు రకరకాల వ్యర్థాలుగాను బయటకు వెళతాయి.
తగ్గినా తగ్గనట్టే..
ఎంతో కాలం కష్టపడి బరువు తగ్గుతాం. ఏ కాస్త ఏమరపాటుగా తిన్నా, ఎక్సర్ సైజ్ విషయంలో కాస్త బద్ధకించినా చాలా త్వరగా బరువు పెరుగుతాం. ఈ సమస్య చాలామందిని వేధించేదే. దీనికి కారణమేంటో తెలుసుకుంటే పరిష్కారం సులువౌతుంది. తెలుసుకుందామా మరి..!
మనం బరువు తగ్గుతున్నప్పుడు శరీరంలోని కొవ్వు కణాలు కుచించుకుపోతాయి. అవి నాశనం కావు. కుచించుకున్న కొవ్వు కణాలు మళ్లీ యథాస్థితికి చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఒకసారి బరువు తగ్గినవారు మళ్లీ చాలా త్వరగా బరువు పెరుగుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే దీనికి పరిష్కారం. వ్యాయామం కొవ్వు కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతుంది. ఏదైనా క్రాష్ డైట్‌ని పాటించి, తిరిగి మామూలు డైట్‌లోకి రావాలనుకున్నప్పుడు ఒకేసారి మారకుండా క్రమక్రమంగా డైట్‌లో మార్పులు చేసుకోవాలి.
ఇదీ చూడండి:ఇలా అనుకున్నది చేసేస్తే మీరే గొప్పోళ్లు!