తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సుఖీభవ: నిద్ర తగ్గిందంటే... నీరూ తగ్గుతున్నట్టేనట! - health instructions

తెల్లారి నిద్రలేచిన తర్వాత ఉత్సాహంగా అనిపించటం లేదా...? ఆలోచనలు సాఫీగా సాగటం లేదా..? తలనొప్పి వేధిస్తోందా...? వీటన్నింటికీ కారణం ఒంట్లో నీటి శాతం తగ్గటమేనంట! దానికి కారణం కంటి నిండా నిద్రలేకపోవటమే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అదేంటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.

water levels decreases in body when not sleep well
సుఖీభవ: నిద్ర తగ్గిందంటే... నీరూ తగ్గుతుందంతే...!

By

Published : Jun 16, 2020, 7:08 PM IST

మీరంతా కంటి నిండా నిద్రపోతున్నారా...? ఒకసారి చెక్​ చేసుకోండి. ఎందుకంటే కేవలం ఆరు గంటల సేపే నిద్రపోయేవారికి ఒంట్లో నీటిశాతం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటోందని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఒంట్లో నీటి శాతం తగ్గితే నిరుత్సాహం, నిరాసక్తత, చిరాకు, ఏకాగ్రత దెబ్బతినటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పీయూష గ్రంథి వాసోప్రెసిన్​ అనే హార్మోన్​ను విడుదలయ్యేలా చేస్తుంది. ఇది మూత్రపిండాలను మూత్రాన్ని పట్టి ఉంచేలా చేస్తుంది. దీని వల్ల ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా వెళ్లిపోవన్నమాట. సాధారణంగా గాఢనిద్రలో వాసోప్రెసిన్​ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. ఒకవేళ మనం ముందుగానే నిద్రలేస్తే ఇది కిడ్నీలకు అంతగా చేరుకోదు. దీంతో అవి మూత్రాన్ని సరిగా పట్టి ఉంచలేవు. ఫలితంగా నీటి శాతం తగ్గుతుంది.

ఈ దుష్ప్రభావాలన్నింటినీ తప్పించుకోవాలంటే కంటి నిండా నిద్రపోవటం మంచిది. అది కుదరకపోతే లేచిన వెంటనే గ్లాసు నీరు తాగటమైనా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇదీ చదవండి:కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details