కరోనా వైరస్ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోమంటున్నారు. పోషకాహార లేమి, ఒత్తిడి-ఆందోళనలు, మొబైల్ రేడియేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి.. ఇవన్నీ సంతానలేమికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతమున్న కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జంటలు ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నాయి. ఇలా కూడా చాలామందికి వయసు పెరిగి సంతాన భాగ్యం కరువవుతోంది. దాంతో ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన చికిత్సల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా వివిధ కారణాల వల్ల సంతానలేమితో బాధపడుతూ.. వివిధ చికిత్సలు చేయించుకుంటోన్న వారు మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా గర్భం ధరించడాన్ని వాయిదా వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. |
ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా.. ? కాదా..? - pregnant woman's news
కరోనా వైరస్ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోమంటున్నారు.
కొవిడ్ అందులో లేదట!
గర్భిణులు ఒకవేళ కరోనా బారిన పడినా.. వారు తమ కడుపులోని బిడ్డ గురించి భయపడుతుంటారు. కానీ తల్లి నుంచి కడుపులోని బిడ్డకు వైరస్ సోకడం అనేది చాలా అరుదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వైరస్ ఆనవాళ్లు తల్లి పాలల్లో, ఉమ్మనీరులో లేవని ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి దీని గురించి బెంగ పడకుండా తల్లులు నిపుణుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చనేది నిపుణుల అభిప్రాయం!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
* గర్భిణులు, సంతానం కోసం చికిత్సలు తీసుకునే వారు ఆస్పత్రులు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం.. వంటివి అస్సలు మరవద్దు. అలాగే ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం/కడుక్కోవడం మంచిది.
* ఆరోగ్యాన్ని సంరక్షించుకునే క్రమంలో నిపుణుల సలహా మేరకు చక్కటి పోషకాహారం తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలకు మీ మెనూలో చోటివ్వండి.
* ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వారికి బీఎంఐ 18.5 – 24.9 మధ్య ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ మీ బీఎంఐ ఇంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం నిపుణుల సలహా మేరకు ముందు బరువు తగ్గడం ఉత్తమం.
* ఫోలికామ్లం వంటి నిపుణులు సూచించిన విటమిన్ సప్లిమెంట్స్ వేళకు వేసుకోవడం మర్చిపోవద్దు.
* కరోనా భయాల్ని, ఇతర మానసిక సమస్యల్ని దూరం చేసుకోవడానికి వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి.
* ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్ తీసుకునే వారు చేపలు తినకూడదట! ఎందుకంటే ఇందులోని మెర్క్యురీ చికిత్సలు/ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్న వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.
ఇక వీటితో పాటు వేళకు తినడం, నిద్ర పోవడం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం, ఎప్పుడూ రిలాక్స్‌డ్‌గా ఉండడం తప్పనిసరి! అలాగే ఈ క్రమంలో బ్లీడింగ్, వెజైనల్ డిశ్చార్జ్.. వంటి వాటితో పాటు ఇతర అనారోగ్యాలేవైనా ఎదురైతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లని సంప్రదించడం అన్ని విధాలా శ్రేయస్కరం!
ఇదీ చదవండి:కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం