మగవాళ్లలో కొంతమందికి అంగం చిన్నదిగా ఉండటం వల్ల వారు భార్యల ముందు అవమానంగా, సిగ్గుగా ఫీలవుతారు. అంగాన్ని పెద్దదిగా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివారు శృంగారంలో పాల్గొనకుండా తప్పించుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నిజంగా అంగం చిన్నగా ఉంటే భార్యను సుఖపెట్టలేరా? నిపుణుల సమాధానం ఏంటో తెలుసుకోండి.
ప్రశ్న: అంగం చిన్నదిగా ఉంటే రతిలో మహిళకు తృప్తి ఉండదా?
సమాధానం:అలా ఏమీ ఉండదు. అంగం చిన్నగా ఉన్నా, పెద్దగా రతిలో మహిళకు ఒకే రకమైన తృప్తి కలుగుతుంది. అంగం పెద్దగా ఉంటే ఎక్కువగా తృప్తి కలుగుతుందని చాలా మంది మగవారు పొరబడుతుంటారు. వాస్తవానికి మహిళకు సుఖాన్ని కలిగించే కామనాడులు రెండు, రెండున్నర అంగుళాలు మాత్రమే ఉంటాయి. అక్కడి వరకే అనుభూతి కలుగుతుంది. తర్వాత ఎలాంటి కామనాడులు ఉండవు. కాబట్టి పురుషాంగం ఎంత పొడవున్నా లోపల ఏమీ తెలియదు. పురుషాంగం నాలుగు అంగుళాలు ఉండి, సరిగ్గా చేయగలిగితే మహిళకు చెప్పలేనంత తృప్తి కలుగుతుంది.
ఒకవేళ.. 'నీ అంగం చిన్నదిగా ఉంది, నాకు తృప్తి కలగడం లేదు' అని ఎవరైనా మహిళ అంటే వారి మధ్య మానసిక అనుబంధం, ఆప్యాయత, అనురాగం లేదని అర్థం. అందుకు మానసిక పరమైన కారణాలే కానీ అంగం పరిమాణం ఏమాత్రం కాదు.
ప్రశ్న: పురుషాంగ పరిమాణం పెరుగుతుందా?
సమాధానం:పురుషాంగం పరిమాణం పెరగడం అనేది అసాధ్యం. అసలు జరగదు. స్తంభించిన పురుషాంగం ఉదాహరణకు 6 అంగుళాలు ఉంటే.. ఏం చేసినా అంతకుమించి పెరగదు. ఇంకా తగ్గుతుంది కానీ పెరగదు.