తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

తరచూ తల వెనుక నొప్పి వస్తుందా.. అయితే కారణాలు ఇవే కావొచ్చు!

తరచూ తల వెనుక నొప్పితో బాధపడుతున్నారా? ఏ పని చేయాలన్నా తలపోటు మిమ్మల్ని చేయనివ్వడం లేదా? అయితే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయద్దంటున్నారు నిపుణులు.

spinal headache
spinal headache

By

Published : Sep 1, 2022, 8:01 AM IST

చాలామందికి తరచూ తల అంతా నొప్పి రాకుండా తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో అది మరింత పెరుగుతుంది. అలా తీవ్రమైన నొప్పి అనేక సమస్యలకు దారి తీస్తాయంటున్నారు నిపుణులు.

"వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను అట్లాస్‌ (సీ1) అంటారు. ఇది పుర్రెను, రెండో వెన్నుపూసను కలుపుతుంది. తలను మోసేది, తల కదలటానికి తోడ్పడేదీ ఇదే. దెబ్బలు తగలటం, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి కారణాల మూలంగా కొన్నిసార్లు ఈ వెన్నుపూస ఉన్నచోటు నుంచి జరిగిపోవచ్చు. అప్పుడు అక్కడి నాడి నొక్కుకుపోవచ్చు. అనుసంధాన కీలూ దెబ్బతినొచ్చు".

-- జీవీ సుబ్బయ్య చౌదరీ, సీనియర్​ న్యూరాలజిస్ట్​

"తల వెనకాల (ఆక్సిపటల్‌), మెడ పైభాగంలో నొప్పి రావటానికి ఇదొక కారణం. కొందరికి తలకు ఒకవైపున నొప్పి కూడా రావొచ్చు. తలలో ఏదో పొడుస్తున్నట్టు, బాదుతున్నట్టుగా నొప్పి పుడుతుంది.అయితే దీన్ని కచ్చితంగా గుర్తించటం అవసరం. స్పెషల్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ సర్వైకల్‌ స్పైన్‌ పరీక్షలతో నిశితంగా పరిశీలించి నిర్ధరించాల్సి ఉంటుంది. తలను పైకెత్తినప్పుడు, కిందికి దించినప్పుడు పూస ఎలా ఉంటోంది, ఎటువైపునకు జరుగుతుందనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్‌ పూస నిజంగానే స్థానభ్రంశం చెందినట్టు తేలితే సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది. మీరు న్యూరాలజిస్ట్‌ను గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారు." అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:గుండె అందరికీ ఒకేలా కొట్టుకోదు.. ఎందుకో తెలుసా?

కిడ్నీల ఆరోగ్యం కోసం ఏ ఆహారం తీసుకోవాలంటే

ABOUT THE AUTHOR

...view details