తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చర్మాన్ని శాశ్వతంగా ఆరోగ్యంగా మార్చేద్దామిలా..!

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. అదేపనిగా క్రీమ్​లు రాసుకోవడం, పూతలు వేసుకోవడం మామూలే. కానీ అవి మాత్రమే సరిపోవు. అదనంగా ఆహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరిష్కారం దీర్ఘకాలికంగా ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటో చూసేద్దాం రండి...

food for healthy skin home remedies
చర్మాన్ని శాశ్వతంగా ఆరోగ్యంగా మార్చేద్దామిలా...!

By

Published : Sep 27, 2020, 10:30 AM IST

చర్మాన్ని శాశ్వతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంలో కొన్ని పదార్థాలను చేరిస్తే సరి. ఇంతకీ అవేంటంటే..

గుమ్మడి గింజలతో అందం

గుమ్మడి గింజలు

చర్మాన్ని బిగుతుగా మారుస్తాయివి. వీటిలో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ శాతాన్ని పెంచడమే అందుకు కారణం.

క్యారెట్లు

వీటిలో బీటా కెరొటిన్‌ ఎక్కువ. ఇది చర్మానికి హానిచేసే అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది. రోజుకో క్యారెట్‌ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారడమే కాదు.. తాజాగానూ మెరిసిపోతుంది.

కొబ్బరితో చర్మం నిగనిగ

కొబ్బరినీళ్లు..

కొబ్బరి నీళ్లు శరీరంలోని డీహైడ్రేషన్‌ని తగ్గించడంతోపాటూ.. చర్మానికీ తేమనందిస్తాయి. తాజాగా కనిపించేలా కూడా చేస్తాయి.

టోఫు పనీర్‌

చర్మం యవ్వనకాంతితో మెరిసిపోవాలంటే.. దీన్ని తరచూ తినాలట. ఇందులో ఉండే మాంసకృత్తులు..చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

నిమ్మతో నిగారింపు

నిమ్మజాతిపండ్లు

వీటిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొలాజెన్‌ శాతాన్ని పెంచడంతో పాటూ, ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అలానే చర్మం ముడతలు పడకుండానూ కాపాడుతుంది.

ఖీరాతో ఆరోగ్యం

కీరదోస

ఇందులో సిలికా అనే పదార్థం అధికశాతంలో ఉంటుంది. ఇది చర్మాన్ని తాజాగా మార్చడంతోపాటూ.. జుట్టుకీ మెరుపునందిస్తుంది.

ఇదీ చదవండి: హాయిగా నిద్రపోతే మతిమరుపు మటుమాయం!

ABOUT THE AUTHOR

...view details