Doctor advice for good sleep: కంటి నిండా నిద్ర కావాలా? 10-3-2-1 నియమాన్ని పాటిస్తే చాలంటున్నారు నిపుణులు. దీని వెనుక రహస్యాన్ని వివరిస్తున్నారు. రోజూ సరైన సమయానికి నిద్రపోయేలా చేయడమే కాదు, ఉదయం అనుకున్న టైంలో లేవడానికి కూడా ఈ నియమం సహాయ పడుతుంది. సాధారణంగా జీవనశైలి సరిగ్గా లేనప్పుడు అది మెదడును నిద్రలోకి జారనివ్వకుండా భంగపరిచి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరానికి సరిపడేంత నిద్ర పోయినప్పుడు నరాల వ్యవస్థ, జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. నిద్రలేమి వీటన్నింటి పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది. దీంతో హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులు, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. రోజూ ఏడెనిమిది గంటల నిద్రతో ఈ సమస్యలన్నింటినీ దూరంగా ఉంచొచ్చు.
పనిలో:మంచంపైకి చేరుకునే 2 గంటలకు ముందే పనంతా పూర్తిచేయాలి. బెడ్‌పైన కూడా ల్యాప్‌టాప్ పెట్టుకు కూర్చుంటే మనసంతా పనిపైనే ఉండి మెదడు నిద్రకి సిద్ధపడదు. ఆఫీసు లేదా ఇంటిపనిని ముందుగానే పూర్తి చేయడంతో మెదడు విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఆ తర్వాత గంట ముందు నుంచే స్క్రీన్లకు దూరంగా ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కంటిపై ఏ కిరణాల ప్రభావమూ లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. చివరగా జీరో అవర్‌కల్లా నిద్ర దరిచేరడానికి శరీరం, మనసు సిద్ధమవుతాయి. ఇక కంటినిండా నిద్రపోవడమే తరువాయి. నియమం బాగుంది కదూ. పాటిస్తే మంచిది కూడా.