Day Time Sex Is Good Or Bad : చాలామంది భార్యాభర్తల్లో శృంగారం గురించి అనేక అనుమానాలు కలుగుతూ ఉంటాయి. రతిలో ఎప్పుడు పాల్గొనాలనే విషయంపై అనేక అపోహాలు ఉంటాయి. దానికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. పగటిపూట రతిలో పాల్గొనాలా? లేదా రాత్రి సమయానికే పరిమితం అవ్వాలా? అనే ఆలోచనలు చాలానే ఉంటాయి. ఈ అనుమానాల వల్ల చాలామంది శృంగారంలో సరిగ్గా పాల్గొనరు. పగటిపూట శృంగారంలో పాల్గొంటే సరైన సంతానం కలగదని చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. అలాగే జ్వరంగా ఉన్నప్పుడు రతిలో పాల్గొనడం ప్రమాదకరమని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. జ్వరంగా ఉన్నప్పుడు శృంగారలో పాల్గొంటే ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని భావిస్తూ భయపడుతూ ఉంటారు. ఇలాంటి చాలా విషయాలకు ఆందోళన చెంది రతిలో సరిగ్గా పాల్గొనరు. వీటిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
పగటిపూట రతిలో పాల్గొనడం వల్ల పిల్లలు ఆరోగ్యకరంగా జన్మించరని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పగటిపూట లేదా రాత్రిపూట, ఉదయం.. ఇలా ఏ సమయంలో పాల్గొన్నా ఒక్కటేనని అంటున్నారు. శృంగారంలో పాల్గొనడానికి మంచి సమయం అంటూ ఏదీ ఉండదంటున్నారు. పిల్లలు ఆరోగ్యకరంగా జన్మించడానికి, రతిలో పాల్గొనే సమయానికి అసలు సంబంధం లేదని చెబుతున్నారు.
రతిలో పాల్గొన్న తర్వాత పురుషుడి వీర్యకణాలు మహిళలోని అండంతో కలవడానికి రెండు రోజుల సమయం పడుతుంది. వీర్యకణాలు అండంతో కలిసేది గర్భాశయంలో కాదని, గర్బాశయం పక్కన ఉన్న అండవాహికల్లో కలుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అండంతో వీర్యకణాలు కలిసిన తర్వాత ఫలదీకరణ చెంది గర్భం రావడానికి కొంత సమయం పడుతుంది. వీర్యకణాలు అండంతో కలవడానికి చాలా సమయం పడుతుంది, దీంతో రతిలో ఎప్పుడు పాల్గొన్నా ఒక్కటే. ఎప్పుడు కలిసినా ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మాత్రమే రతిలో పాల్గొనాలని, పగటిపూట పాల్గొనకూడదనే భావన సరికాదని అంటున్నారు. ఇద్దరికీ ఒకే అనుకుప్పుడు ఎప్పుడు పాల్గొన్నా ఒక్కటేనని చెబుతున్నారు.