తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అలా జరిగితే.. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇప్పించొచ్చా? - corona vaccine side effects

మా అమ్మాయికి (వయసు 24) కరోనా మొదటి మోతాదు టీకా ఇచ్చినప్పుడు వాంతి అయ్యింది. అప్పుడు ఏదో ఇంజెక్షన్‌ ఇచ్చారు. సెలైన్‌ ఎక్కించారు. రెండో మోతాదు టీకాకు సమయం దగ్గరపడింది. ఇప్పుడు ఇప్పించొచ్చా?

కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్

By

Published : Sep 14, 2021, 9:27 AM IST

"కొవిడ్‌-19 టీకా తీసుకున్న చాలామందిలో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించటం లేదు. కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి రెండు మూడు రోజుల పాటు ఉంటున్నాయి. వాంతి అవుతున్న దాఖలాలు పెద్దగా చూడలేదు. నిజానికి కొవిడ్‌-19 టీకా దుష్ప్రభావాల్లో వాంతి కూడా ఒకటి. ఎందుకంటే ఇదీ వైరస్‌ మాదిరిగానే ప్రభావం చూపుతుంది. కరోనా జబ్బును తెచ్చిపెట్టే సార్స్‌-కొవీ-2 బారినపడ్డవారిలో వాంతులు, విరేచనాలు అవుతున్న విషయం తెలిసిందే. మీ అమ్మాయికి మొదటి మోతాదు టీకా తీసుకున్నప్పుడు వాంతి అయ్యిందంటున్నారు. రెండో మోతాదు టీకాతోనూ వాంతి అయ్యే అవకాశం లేకపోలేదు. ఈసారి ఇంకాస్త ఎక్కువగానూ కావొచ్చు. అసలు వాంతి కాకపోవచ్చు కూడా. అందువల్ల మీరు టీకా ఇప్పించటానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందికి ముందే ఈ విషయం చెప్పటం మంచిది. అప్పటి పరిస్థితిని బట్టి అవసరమైన పరీక్షలు చేస్తారు. టీకా ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ టీకా ఇవ్వాలని నిర్ణయిస్తే ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకుంటారు. నిజానికి టీకాతో ఒనగూరే లాభాలతో పోలిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు. కాబట్టి టీకా ఇప్పించటమే మంచిది."

- డా.ఎంవీ రావు, జనరల్ ఫిజీషియన్

ABOUT THE AUTHOR

...view details