బరువు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఊబకాయం ఉన్నట్లు కాదు. వారి ఎత్తును బట్టి బరువు ఎంత ఉండాలో ఓ లెక్క ఉంది. అంతకుమించినప్పుడు మాత్రమే.. ఊబకాయం (Childhood Obesity) అని అంటారు. చిన్నపిల్లల్లో వచ్చే స్థూలకాయం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇలాంటి వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఇదే సమస్యతో బాధపడడం, పదిమంది మధ్య ఆత్మనూన్యతతో బతకాల్సి రావడం ఇబ్బందికర పరిస్థితికి దారి తీస్తుంది. అందుకే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం.
స్థూలకాయం లేదా ఊబకాయం (Childhood Obesity).. శరీరంలో అవసరానికి మంచి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెడు చేసే ఓ వ్యాధి. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్ లేదా బీఎంఐ (Body Mass Index Obesity) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా చదరపు మీటర్‌కు 30 కిలోలు ఉండే స్థూలకాయంగా లెక్కిస్తారు. కొంతమంది పిల్లల శరీర నిర్మాణం సగటు కంటే పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండడం సహజం. పెరిగే కొద్ది మరింతగా పెరుగుతుండడం ఊబయకాయానికి గుర్తు. బరువు ఎత్తుకు సంబంధించిన పట్టిక చూసి డాక్టర్లు స్థూలకాయాన్ని నిర్ధరణ చేస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా? లేదా? బరువు- ఎత్తు నిష్పత్తిలో స్థానం ఎక్కడుంది? పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరం అనేది నిర్ణయిస్తారు. దీని వల్ల గుండె వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోకపోవడం, గురక పెట్టడం, కీళ్ల వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
స్థూలకాయం ఉన్న పిల్లల శరీరాలు అలసటకు గురి కావడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది. మార్కెట్లో లభిస్తున్న వివిధ రకాల ఆయిల్ ఫుడ్స్, తినుబండారాలు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతుంది.