నమస్తే డాక్టర్. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈమధ్యే నాకు పీరియడ్ మిస్ అయితే ఇంట్లో హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఆస్పత్రిలో చెక్ చేసుకుంటే వీక్ పాజిటివ్ అని డాక్టర్ చెప్పారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి డ్వైడ్రోబూన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అవి వాడితే లేత గోధుమ రంగు, ఎరుపు రంగు డిశ్చార్జ్ లైట్‌గా అవుతోంది. అసలు నేను గర్భిణినా, కాదా తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ని కాకపోతే అంతకు ముందులాగా నాకు పీరియడ్స్ వచ్చి, నార్మల్ బ్లీడింగ్ కావాలంటే నేనేం చేయాలో చెప్పగలరు. - ఓ సోదరి
ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా డిశ్చార్జ్ అవుతోంది.. ఎందుకని? - doubts on pregnancy discharge
మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉద్యోగ పనివేళలు మహిళల ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఇది సంతానంపై కూడా ప్రభావం చూపించవచ్చు. పీరియడ్స్ పరంగా ఎటువంటి సమస్యలు లేకున్నా గర్భం దాల్చేందుకు అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలినా అది నిలిచేవరకు సందేహమే.. ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఓ సోదరి..!
ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చినా డిశ్చార్జ్ అవుతోంది
జ: మీరు రాసిన దాన్ని బట్టి చూస్తే బహుశా మీకు గర్భం వచ్చినందుకే అది నిలవడానికి డాక్టర్ ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఉంటారు. అయితే లోపల పిండం సరిగ్గా ఎదుగుతుందా, లేదా తెలుసుకోవాలంటే మీరు మళ్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిండం ఎదుగుదల సరిగ్గా లేకపోతే మాత్రల ద్వారా గానీ లేదా ఒక చిన్న ఆపరేషన్ ద్వారా గానీ గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పీరియడ్స్ ముందులాగే నార్మల్‌గా వస్తాయి.