మన శరీరాన్నంతటిని మోసే మడమకు సమస్య వస్తే నడవడం చాలా కష్టం. ఉదయం పూట కాలు కింద పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. జివ్వుమనే నొప్పితో విలవిలలాడిపోవాల్సిందే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దానికి ఆయుర్వేదం చూపించే మార్గాలెంటో ఆయుర్వేద ఫిజిషియన్ పెద్ది రమాదేవి వివరించారు.
మడమ నొప్పి వేధిస్తోందా?.. ఈ ఆయుర్వేద చికిత్సతో సమస్య మటుమాయం!
శరీరంలో ఉండే అతిపెద్ద కీలు మడమ. అందుకే మడమను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మడమ నొప్పి ప్రారంభమైతే తట్టుకోవడం కష్టం. అసలు మడమ నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారమేంటి?
అతి పెద్ద కీలు ఇదే
మన శరీరంలో అతి పెద్ద కీలు మడమ. దాదాపుగా 33 ఎముకలతో కూడి ఉంటుంది. దాదాపుగా 100 కండరాలు చుట్టూ ఉంటాయి. ఈ పాదాలు సజావుగా ఉంటేనే ఆటాడగలం..నడవగలం..పరిగెత్తగలం..దూకగలం..ఈ కదలికలకు మూలం మడమ చుట్టూ ఉండే కండరాలే సుమా. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
నొప్పి తగ్గించుకోండి ఇలా..
అధికంగా పని చేసినా, బి 12 లోపంతో గానీ మడమ నొప్పి వస్తుంది. నొప్పి ఉన్నపుడు బరువు తగ్గించుకోవడంతో పాటు మధుమేహం ఉంటే తగ్గించుకోవాలి. కాలికి మెత్తని చెప్పులు లేకుండా నడవొద్దు. మజ్జిగ తాగితే చాలా మేలు చేస్తుంది. గోరు వెచ్చని ఉప్పుతో కాపడం పెట్టాలి. నువ్వుల నూనె, కర్పూరం సమపాళ్లలో కలిపి పాదం కింది భాగంలో మసాజ్ చేయాలి. పులుపు, దుంపకూరలకు దూంగా ఉండాలి. వేడి నీటిలో కాళ్లు పెట్టి అటూ ఇటూ తిప్పాలి. సాధారణ నొప్పి అయితే తగ్గిపోతుంది. ఎముక విరిగినట్లయితే సర్జరీకి వెళ్లాల్సిందే.