యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన బాలరాజు అనే వ్యక్తి... వివిధ గ్రామాల్లో తిరిగి బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తుర్కపల్లి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వల్ల వేరే గ్రామాల ప్రజలు తనను అడ్డుకుంటున్నారని బాలరాజు ఆరోపించారు. "మీ గ్రామంలో కరోనా కేసులు ఉన్నాయని... నువ్వు మా ఊరిలోకి రావొద్దంటున్నారు" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
'ఊళ్లలోకి రానివ్వట్లేదు... వ్యాపారం చేసుకోనివ్వట్లేదు..'
తనది బట్టల వ్యాపారం... ఊరూర తిరిగి బట్టలు అమ్ముకోవటమే ఆధారం. కానీ... ఎవ్వరూ గ్రామాల్లోకి రానివ్వట్లేదు. వేరే పని చేసుకుందామన్నా చేయలేని దుస్థితి. చేతిలో డబ్బు లేక... వచ్చిన పని చేద్దామంటే చేయనియ్యకపోవటం వల్ల కుటుంబపోషణ చాలా ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఓ చిరువ్యాపారి.
Small business mans facing problems in corona time
తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని... కుటుంబపోషణ చాలా ఇబ్బందిగా మరిందని తెలిపారు. వేరే పని ఉన్న చేయలేని పరిస్థితి ఉందని వాపోయాడు. తమ గ్రామంలోని కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని... దయచేసి వ్యాపారం చేసుకోనివ్వాలని కోరుతున్నాడు. దాతలు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.