యాదాద్రి క్షేత్రంలోని శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి శివబాలా ఆలయంలో శ్రీ సీతారాముల వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 25న ప్రారంభమైన వేడుకలు రేపటితో ముగియనున్నాయి. ఏకాదశి పురష్కరించుకుని స్వామివారి ఏకాంత సేవలో రమాసత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
యాదాద్రి క్షేత్రంలో సీతారాముల నవరాత్రి ఉత్సవాలు - yadadri latest news
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏకాదశి పురష్కరించుకుని స్వామివారి ఏకాంత సేవలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతపూజ నిర్వహించారు.
యాదాద్రి క్షేత్రంలో సీతారాముల నవరాత్రి ఉత్సవాలు
కరోనా ప్రభావం వల్ల భక్తులు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. కొద్దిమంది అర్చకుల సమక్షంలో పూజాదిక్రతువులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!