తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి క్యూ కాంప్లెక్స్​లో ముమ్మరంగా వసతుల కల్పన

యాదాద్రీశుని కొండపైన భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తోన్న క్యూ కాంప్లెక్స్​ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సగం పనులు పూర్తైనట్టు యాడా అధికారులు వెల్లడించారు.

que complex construction works at yadadri temple in yadadri bhuvanagiri
యాదాద్రి క్యూ కాంప్లెక్స్​లో ముమ్మరంగా వసతుల కల్పన

By

Published : Jul 14, 2020, 1:21 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండపైన నూతనంగా రెండు వేల మందికి సరిపడా మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మించిన విషయం విధితమే. కాగా భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు యాడా అధికారులు వెల్లడించారు.

క్యూ కాంప్లెక్స్​లో ఇప్పటికే గ్రానైట్​తో ఫ్లోరింగ్, సీలింగ్ ఫ్యాన్స్, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. త్వరలోనే తాగునీటి పైపులు భక్తులు కూర్చోవడానికి బెంచీలు కాంప్లెక్స్ నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లడానికి క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ABOUT THE AUTHOR

...view details