కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నాటి నుంచి జీతాలు లేక ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ప్రైవేటు టీచర్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. కుటుంబాలను పోషించుకోలేక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మమ్మల్ని ఆదుకోండి: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ మొదలు పాఠశాలలు మూతపడి జీతాలు లేక తాము నానా అవస్థలు పడుతున్నట్టు వారు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.
మమ్మల్ని ఆదుకోండి: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,000 మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, పాఠశాల యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ తమను పట్టించుకోవటం లేదని జిల్లా కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందించారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!