తెలంగాణ

telangana

ETV Bharat / state

KOMATIREDDY VENKATREDDY: రేవంత్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని... పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామని చెప్పినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. భువనగిరి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

mp-komatireddy-venkatreddy-speaks-about-revanth-reddy
రేవంత్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు..!

By

Published : Aug 8, 2021, 3:03 PM IST

Updated : Aug 8, 2021, 3:57 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ రాజీవ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ది అరాచక పాలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి విలపించేవాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

రేవంత్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని చెప్పా. సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే సీఎంలా వ్యవహరిస్తున్నారు.భువనగిరి పార్లమెంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు. సుమారు రూ.3,400 కోట్లు మంజూరు చేయించా.

- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్... సీఎంలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రం పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సుమారు రూ.3,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వివరించారు.

ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు పీసీసీ దక్కకపోవటంతోనే సీనియర్ కార్యకర్తగా, నాయకుడిగా మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు.

ఇదీ చూడండి:Kidnap: నిర్మల్​లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం.. అందుకోసమేనా?

Last Updated : Aug 8, 2021, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details