యాదాద్రి జిల్లా పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల నాలుగున స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.
సింహవాహనంపై ఊరేగిన యాదగిరీశుడు..
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి.. సింహవాహనంపై వేదమంత్రాల నడుమ స్వామిని తిరువీధుల్లో ఊరేగించారు.
సింహవాహనంపై ఊరేగిన యాదగిరీశుడు..
మూడో రోజైన ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహవాహనంపై ఉత్సవమూర్తులు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. శుక్రవారం తిరుకల్యాణం, 8న రథోత్సవం, 9న చక్రస్నానం, 10న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి:'ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'