తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ వెంచర్లపై హెచ్​ఎండీఏ కొరడా

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండల కేంద్రంలో హెచ్​ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్​లపై కొరడా ఝులిపించారు. వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేయరాదంటూ హెచ్చరించారు.

వెంచర్లపై హెచ్​ఎండీఏ కొరడా

By

Published : May 22, 2019, 7:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండల కేంద్రంలో హెచ్​ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్​లపై కఠిన చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు భూ దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లేఅవుట్లపై హెచ్​ఎండీఏ అధికారులు దాడులు చేశారు. రోడ్లు, సరిహద్దు రాళ్లను జేసీబీలతో తొలిగించారు. వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వెంచర్లపై హెచ్​ఎండీఏ కొరడా

ABOUT THE AUTHOR

...view details