సంచలనం సృష్టించిన హాజీపూర్ అత్యాచారం, హత్యల కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చుతూ నల్గొండ జిల్లా మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గత నెల 6న తీర్పు వెల్లడించింది. సీఆర్ పీసీ 366 సెక్షన్ ప్రకారం కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించాలని కోరుతూ హైకోర్టును ఏసీపీ కోరారు.
హైకోర్టుకు చేరిన హాజీపూర్ అత్యాచారం, హత్యల కేసులు
హాజీపూర్ అత్యాచారం, హత్యల కేసు హైకోర్టుకు చేరింది. శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు విధించిన ఉరిశిక్షను ఉన్నత న్యాయస్థానం ధ్రువీకరించాల్సి ఉంది. అయితే కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
hajipur case
జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. రెండింటినీ కలిపి విచారించాలని నిర్ణయించిన ఉన్నత న్యాయస్థానం... పోలీసులకు, శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి:మానవ మృగానికి మరణ దండన