బొమ్మల రామారం మండలం హాజీపూర్ జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ పోక్సో కోర్టులో మూడు కేసుల్లో ఛార్జీ షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు. కేసు విచారణకు భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించిన విషయం విదితమే. 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసినట్లు బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.
హాజీపూర్ బాలికల హత్య కేసుల దర్యాప్తు పూర్తి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు .
హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ పూర్తి