తెలంగాణ

telangana

ETV Bharat / state

తుర్కపల్లి మండలంలో పర్యటించిన డీఆర్​డీఓ - drdo visit in nalgonda district

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి గ్రామాలను సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు డీఆర్​డీఓ రవీందర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గ్రామాలను పరిశీలించాక... కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని కోరారు.

drdo officer visit in turkapalli mandal
తుర్కపల్లి మండలంలో పర్యటించిన డీఆర్​డీ అధికారి

By

Published : Jun 17, 2020, 6:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి గ్రామాలను సీఎంవో కార్యాలయం ఆదేశాల మేరకు డీఆర్​డీఓ రవీందర్​ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని చెత్త డంపింగ్​ యార్డ్, హరితహారం, అంగన్వాడీ కేంద్రాలు, నర్సరీలు, శానిటేషన్​ పనులు, హెల్త్​ సెంటర్లు, స్కూళ్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు.

కరోనా ప్రబలుతున్న తరుణంలో గ్రామంలో ఎంతమంది మాస్కులు వాడుతున్నారో... సోడియం హైపోక్లోరైట్​ స్ప్రే చేస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించినట్లు రవీందర్​ వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులు ఎంతమేర పూర్తి చేశారో పర్యవేక్షించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details