తెలంగాణ

telangana

యాదాద్రి.. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

By

Published : Jan 20, 2021, 7:57 AM IST

యాదాద్రి రోడ్డు విస్తరణలో భాగంగా.. నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేశారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి ఆలయ అభివృద్ధిలో.. ఆ మాత్రం నష్టం సహజమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. బాధితులకు సూచించారు.

Distribution of compensation to landless people in yadadri by mla gongidi sunitha
యాదాద్రి.. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

యాదాద్రి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న వారు ఏమాత్రం అధైర్య పడొద్దని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 2016లో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతీ బాధితునికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. 28మంది నిర్వాసితులకు రూ.3కోట్ల విలువ గల.. మంజూరు పత్రాలను అందజేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

సుమారు 70మంది బాధితులు.. వారి ఇళ్లు, స్థలాలను ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. వారందరికీ మున్సిపాలిటీ పరిధిలోనే స్థలాల కేటాయింపులు జరుపుతామని స్పష్టం చేశారు.

అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి ఆలయ అభివృద్ధిలో.. ఆ మాత్రం నష్టం సహజమన్నారు ఎమ్మెల్యే. రానున్న రోజుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. బాధితులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి, పురపాలక కమిషనర్ రజిత, మున్సిపల్ ఛైర్మన్ సుధా, వైస్​ఛైర్మన్ కాటంరాజు, యాదగిరిగుట్ట తహసీల్దార్ అశోక్​రెడ్డి, జడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:భూమి తీసుకున్నారు కానీ ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details