బీబీనగర్ ఎయిమ్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న బీబీనగర్ ఎయిమ్స్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించే కేంద్రంగా బాసిల్లుతుందన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను కిషన్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ పురోగతిపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, మిగతా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎయిమ్స్‌ను మరింతగా తీర్చిదిద్దుతాం: కిషన్ రెడ్డి
భవిష్యత్‌లో ఎయిమ్స్‌ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎయిమ్స్‌కు వెయ్యి కోట్లు కేటాయించామన్న కిషన్ రెడ్డి... అవరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎయిమ్స్‌కు కేటాయించిన భవనాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బదలాయించాలని కోరారు. ఇప్పటికే సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి... దశల వారిగా పూర్తి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:డ్రోన్లతో నీటి జాడల గుర్తింపు.. అభివృద్ధి చేసిన ఎన్జీఆర్ఐ