తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalitha Bandhu: 'దళితబంధు మీద అపవాదు పోవాలంటే.. ఇలా చేయండి'

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివారెడ్డి గూడెం, లక్ష్మీదేవిగూడెం, అనాజిపూర్, రెడ్ల రేపాక, బొల్లేపల్లి, సిరివేణికుంట గ్రామాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పర్యటించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్​ యోజన కింద ముంజూరైన... 25 కోట్ల 60 లక్షలతో వేయనున్న రోడ్ల పనులకు.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.

bhuvanagiri-mp-komati-reddy-comments-on-dalitha-bandhu
bhuvanagiri-mp-komati-reddy-comments-on-dalitha-bandhu

By

Published : Sep 22, 2021, 6:48 PM IST

'దళితబంధు మీద అపవాదు పోవాలంటే.. ఇలా చేయండి'

భూమిలేని అన్ని కులాల నిరుపేదల కోసం ప్రత్యేక పథకం తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకున్నా.. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. దళితబంధు అంటే ఎన్నికల కోసం తెచ్చిన తాయిలమనే అపవాదు పోవాలంటే... ప్రతీ నియోజకవర్గంలోని ఒక మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని ప్రభుత్వానికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.

ఎక్కువ నిధులు భువనగిరికే...

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివారెడ్డి గూడెం, లక్ష్మీదేవిగూడెం, అనాజిపూర్, రెడ్ల రేపాక, బొల్లేపల్లి, సిరివేణికుంట గ్రామాలలో ఎంపీ పర్యటించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్​ యోజన కింద ముంజూరైన... 25 కోట్ల 60 లక్షలతో వేయనున్న రోడ్ల పనులకు.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణలోనే ఎక్కువ రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్చిన నియోజకవర్గం భువనగిరేనని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

యాదగిరిగుట్టు వరకు ఎంఎంటీఎస్​..

రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకున్నా.. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువస్తున్నామని కోమటిరెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్​ను ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు పొడిగించాలని ప్రధానమంత్రిని కోరామని తెలిపారు. దీని కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. భువనగిరి మున్సిపాలిటీని అండర్​గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

ఆ పథకమే ఉండదు...

"భారతదేశంలో ఏ ఎంపీ తెచ్చుకోనన్ని నిధులు తెచ్చుకుని నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా. రేపు మూసీని కూడా శుభ్రం చేయిస్తా. హైదరాబాద్​ నుంచి నకిరేకల్​ వరకు ఎక్కడెక్కడ ట్రీట్మెట్​ ప్లాంట్లు పెట్టాల్నో అక్కడ పెట్టి... రెండేళ్లలో మూడు నాలుగు వేల కోట్లు అయినా సరే ఖర్చుపెట్టి మూసీని శుభ్రం చేయిస్తా. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం​ అస్తవ్యస్తం చేశిండ్రు. అందుకే ధరణీని రద్దు చేయాలని నా డిమాండ్​. దళితబంధు పేరిట.. ఇంటికి పది లక్షలు అన్ని ఊళ్లకు ఇవ్వటం సాధ్యమేనా..? హుజూరాబాద్​ ఎన్నికలు అయిపోయాక ఆ పథకమే ఉండదు. ప్రపంచంలో నంబర్​ వన్​ అబద్దాలు చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆర్​, ఆయన కొడుకు కేటీఆర్​."- కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎంపీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details