తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరందరికి 'అమ్మ' మరో మదర్ థెరిస్సా

పక్క వారినే పట్టించుకోకుండా పోతున్న ఈ రోజుల్లో నా ఊరు.. నా వాళ్లు.. అంటూ సేవలందిస్తున్న 76 ఏళ్ల వృద్ధురాలే థెరిస్సా. గ్రామంలో ఎవరికైనా ఆపద అంటే.. నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తూ అందరికి తలలో నాలుకగా నిలుస్తోంది.

గ్రామసేవ చేస్తున్న థెరిస్సా

By

Published : Mar 8, 2019, 5:37 PM IST

గ్రామసేవ చేస్తున్న థెరిస్సా
యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారం గ్రామంలో పుట్టిన థెరిస్సా స్వతహాగా ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేది. 42వ ఏట భర్త మరణించిన సమయంలో నుదుటిపై బొట్టు, చేతి గాజులు తీస్తున్నప్పుడు అలా ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. భర్త చనిపోయాక ఏ స్త్రీ బొట్టు, గాజులు తీయకూడదని ఉద్యమించింది.

అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న సమస్యలపై పోరాటం ప్రారంభించింది. ధర్మారం గ్రామంలో థెరిస్సా సాయం పొందని గడపే లేదంటే అతిశయోక్తి కాదు. గ్రామంలోని వృద్ధులకు నెలకు 50 రూపాయల పింఛను అందిస్తున్నది. ఊళ్లో ఎవ్వరు గుడిసెలో ఉండొద్దని... ఇళ్లు లేని దళితుల జాబితా తయారు చేసి ఆర్థిక సాయం అందించింది.

ఎందరో పేద విద్యార్థుల చదువు కోసం చేయూత అందిస్తోంది థెరిస్సా. గ్రామంలో తాగునీటి కొరత తీర్చేందుకు బోరు బావి తవ్వించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరి ఎన్నో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది.

ఊరందరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునే థెరిస్సాను గ్రామస్థులు తమ ఊరి మదర్ థెరిస్సాగా పిలుచుకుంటున్నారు.

ఇవీ చదవండి: 'వనిత' కోసం సైకతశిల్పం

ABOUT THE AUTHOR

...view details