యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వరంగల్‌కు చెందిన శేషగిరి అనే భక్తుడు సుమారు రూ.మూడు లక్షల విలువైన ముప్పావు కిలో బంగారంతో తాపడం చేసిన కిలోన్నర బరువు గల బంగారు కలశాన్ని బహూకరించారు. దీన్ని అష్టోత్తర శత ఘటాభిషేకంలో ఉపయోగించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కలశంపై నగిషీలను జయపుర చెక్కించారు. అష్టలక్ష్మిల చిత్రాలు, అందమైన నగిషీలతో బంగారు కలశం ఆకర్షణీయంగా ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు.
యాదాద్రి దేవస్థానానికి బంగారు కలశం బహూకరణ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వరంగల్ కు చెందిన ఓ భక్తుడు శేషగిరి అనే భక్తుడు ముప్పావు కిలో బంగారంతో తాపడం చేసిన కిలోన్నర బరువుగల గల బంగారు కలశాన్ని బహుకరించారు. దీన్ని అష్టోత్తరశత ఘటాభిషేకంలో ఉపయోగించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కలశం పైన నగిషీల ను జయపురం చెక్కించారు. అష్టలక్ష్మిల చిత్రాలు, అందమైన నగిషీలతో బంగారు కలశం ఆకర్షణీయంగా ఉండడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు.
రథానికి బంగారు తాపడం చేయించడానికి..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామి, అమ్మవార్ల దివ్య విమాన రథానికి బంగారు తాపడం చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అయ్యే అయ్యే ఖర్చులో హైదరాబాద్‌కు చెందిన రవీందర్‌రెడ్డి రూ.30 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట సర్పంచి, శ్రీలోగిళ్లు రియల్ ఎస్టేట్ యజమాని సురేష్‌రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. తొలుత రాగి తాపడం చేయించి దానిపై బంగారు పూత వేయిస్తారు. దాతలు మంగళవారం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వెళ్లినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:జోరుగా వ్యాక్సినేషన్- 5 కోట్లకుపైగా డోసులు పంపిణీ