రద్దీ ప్రాంతాల్లోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని చరవాణిల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన 87 చరవాణిలు, 2 కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సీపీ తెలిపారు. మొదట చిల్లర దొంగతనాలకు పాల్పడేవారని.. మరింత డబ్బులు సులభంగా సంపాదించాలనే ఆశతో ముఠాగా ఏర్పడ్డారని వెల్లడించారు. వీరంతా పుణ్య క్షేత్రాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాలను ఎంచుకుని చోరీలకు పాల్పడేవారని తెలిపారు. వీరి బృందంలో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నట్లు సీపీ తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయంలో చరవాణిలను దొంగిలించేందుకు హన్మకొండకు వచ్చిన వారిని... పోలీసులు ముందస్తు సమాచారంతో అరెస్ట్ చేశారు.
అంతర్ రాష్ట్ర చరవాణిల దొంగల ముఠా అరెస్ట్ - warangal cp on inter state thief team
వరుస చరవాణి చోరీలకు పాల్పడుతోన్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 87 ఫోన్లు, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ తెలిపారు.
అంతరాష్ట్ర చరవాణిల దొంగల ముఠా అరెస్ట్
ఇవీ చూడండి: గంజాయి స్వాధీనం... ఆరుగురు అరెస్ట్
TAGGED:
warangal cp