తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'

వరంగల్​లోని 15 నోమూమెంట్ జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు తెలిపారు. నో మూమెంట్​ జోన్​గా ప్రకటించిన జులైవాడలో సీపీ వి.రవీందర్​తో కలిసి పర్యటించారు.

warangal collector and cp visited no movement zone
'వరంగల్​లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'

By

Published : Apr 10, 2020, 7:49 PM IST

వరంగల్​లోని నో మూమెంట్​ జోన్​లలో ఒకటైన జులైవాడలో కలెక్టర్​ ​ రాజీవ్​ గాంధీ హనుమంతు, సీపీ వి.రవీందర్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య సమస్యలు ఏమున్నా.. టెలీ మెడిసిన్ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. లాక్​డౌన్ కచ్చితంగా పాటించి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

మర్కజ్ వెళ్లి వచ్చినవారి ప్రాథమిక సంబంధీకులకు సంబంధించి.. 138 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందంటున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు... సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ మంచి ఫలితాలను ఇస్తోందని... ఒక్క రోజే 624 వాహనాలు స్వాధీనం చేసుకున్నామంటున్న నగర సీపీ రవీందర్​తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి...

'వరంగల్​లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

ABOUT THE AUTHOR

...view details