తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్

హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేటలో ఎంపీ పసునూరి దయాకర్​తో కలిసి ఆయన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

The MP who distributed the checks was the Chief Whip of the Government
చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్

By

Published : Jan 29, 2020, 11:49 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కాజిపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్​లు కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వరంగల్ నగరానికి కాజీపేట్ ముఖద్వారం వంటిదని వినయ్ భాస్కర్ అన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

కాజీపేట్ చౌరస్తాలో ట్రాఫిక్​కి ఇబ్బందికరంగా మారిన చిరువ్యాపారుల దుకాణాల గురించి అధికారులతో మాట్లాడామన్నారు. ట్రాఫిక్​కు ఇబ్బంది కలగకుండా మరోచోట వారికి దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details