వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. భద్రకాళీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఘనంగా భద్రకాళీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు - శాకంబరీ ఉత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మను దర్శించుకుంటున్నారు.
వరంగల్ భద్రకాళీ ఉత్సవాలు