తెలంగాణ

telangana

చారిత్రక నగరిలో రక్షాబంధన్ వేడుకలు

By

Published : Aug 3, 2020, 4:36 PM IST

సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదిన వేడుకలు చారిత్రక నగరి ఓరుగల్లులో ఘనంగా జరిగాయి.

చారిత్రక నగరిలో రక్షాబంధన్ వేడుకలు
చారిత్రక నగరిలో రక్షాబంధన్ వేడుకలు

సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదిన వేడుకలు చారిత్రక నగరి ఓరుగల్లులో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. సోదరులకు బొట్టుపెట్టి, హారతులిచ్చి, మిఠాయి తినిపించి ఎల్లవేళలా తమకు రక్షగా ఉండాలంటూ రాఖీలు కట్టారు.

కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ సంతోషంగా పాల్గొన్నారు. పరస్పరం మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ లు ఇచ్చిపుచ్చుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details