వరంగల్ నగరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి... సంప్రదాయ పద్ధతిలో వస్త్రాలను ధరించి అందంగా ముస్తాబయ్యారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
బతుకమ్మలతో బంగారు తల్లుల సందడి
చిట్టిచిట్టి చేతులతో తీరొక్క పూలు తీసుకొచ్చి.. రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చి.. ఆడుతూ, పాడుతూ నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు విద్యార్థులు.
బతుకమ్మలతో బంగారు తల్లుల సందడి